'బైక్ దొంగల ఆటకు చెక్': నరసరావుపేటలో 22 బైకులు సీజ్, నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: మహేష్ స్థలం: నరసరావుపేట

నరసరావుపేటలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాల కేసును 1వ పట్టణ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ప్రధాన నిందితుడు యన్నబత్తుని మణికంఠను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.14 లక్షల విలువైన 22 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.