పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై అధికారుల నిర్లక్ష్యం: ఏడు వేలకు పైగా అర్జీల్లో అసంతృప్తి

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై అధికారుల ఎండార్స్మెంట్లు ఇష్టానుసారంగా మారుతున్నాయి. సమస్యలు పరిష్కారం కాకపోయినా అయినట్లు చూపుతుండటంతో ఏడు వేలకు పైగా అర్జీదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సమస్యలు పరిష్కరించకుండా తప్పుడు సమాచారమిస్తున్న తనిఖీల్లో తేలిన నేపథ్యంలో ముప్పై ఆరు మందికి పైగా అధికారులకు మెమోలు జారీ చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు వెల్లడించారు.