చిన్నారి ప్రీస్కూల్ అడ్మిషన్‌కు లక్షన్నర విరాళమంటూ పారిశ్రామికవేత్త ఆవేదన
రిపోర్టర్: అశోక్
స్థలం: అహ్మదాబాద్
అహ్మదాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త ప్రీతేశ్ లఖాని తన రెండేళ్ల కూతురి ప్రీస్కూల్ అడ్మిషన్ కోసం ఒక సంస్థ లక్షన్నర రూపాయల విరాళం డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. విరాళం ఇవ్వకపోతే చిన్నారితో పాటు తల్లిదండ్రులకు పరీక్ష నిర్వహిస్తామని పాఠశాల సిబ్బంది తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుండగా, చిన్న వయసులోనే విద్యను వ్యాపారంగా మార్చడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.