తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు: అక్టోబర్ 12 నుంచి వైభవంగా శ్రీవారి వేడుకలు

రిపోర్టర్: మహేష్ స్థలం: తిరుమల

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 12 నుంచి 20 వరకు తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ ఆధ్యాత్మిక వేడుకలు జరగనున్నాయి. అక్టోబర్ 11న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమై, అక్టోబర్ 20న చక్రస్నానంతో పరిసమాప్తమవుతాయి. ఉత్సవ దినాలలో స్వామివారు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనం కల్పిస్తారని అధికారులు స్పష్టం చేశారు.