బంగారు మైసమ్మ ఆలయంలో వైభవంగా జరిగిన చండీ హోమంలో నాతరి స్వామి
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని బంగారు మైసమ్మ ఆలయంలో దుర్గామాత నవరాత్రుల సందర్భంగా శుక్రవారం చండీ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.