కొండా సురేఖను పార్టీలోకి రానివ్వం: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సంచలనం

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఆమెను తెలంగాణ భవన్ గేటు కూడా దాటనివ్వమని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ వీడిన వారిని తిరిగి చేర్చుకునే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలనపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే తీవ్ర అసంతృప్తి ఉందని, త్వరలోనే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరుతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.