బాల కార్మికుడిగా ఎనిమిదేళ్ల బాలుడు మారడంపై నారా లోకేష్ దిగ్భ్రాంతి

రిపోర్టర్: వెంకట్ స్థలం: గుంటూరు

నెల్లూరు జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడితో గొర్రెలు కాయిస్తున్న ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాచవారిపాలెం సమీపంలో చిన్నారి పడుతున్న వేదనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, బాలుడి పరిస్థితి తనను కలచివేసిందని పేర్కొన్నారు. తక్షణమే స్పందించి బాధిత బాలుడిని రక్షించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు. ఈ అమానుష ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసినట్లు నారా లోకేష్ వెల్లడించారు.