కే-బుడుగుంటపల్లి కేంద్రాల్లో ఘనంగా జరిగిన అంగన్వాడీ ఉత్సవాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రైల్వేకోడూరు

రైల్వేకోడూరు మండలం కే-బుడుగుంటపల్లి గ్రామపంచాయతీ పరిధిలో శనివారం అంగన్వాడీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొని కేంద్రాల పనితీరును పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్యపై ఆరా తీశారు. గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలను సమీక్షించారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బందిని ఘనంగా సన్మానించి అభినందించారు.