షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా: ఎడ్ షీరన్ తొలి బాలీవుడ్ పాట విశేషాలు

రిపోర్టర్: రాము స్థలం: ముంబై

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కింగ్ మూవీలో ప్రముఖ అంతర్జాతీయ గాయకుడు ఎడ్ షీరన్ పాట పాడినట్లు ఆ గాయకుడు స్వయంగా వెల్లడించారు. ముంబైలోని మన్నత్ నివాసంలో షారుఖ్ ఖాన్ ను కలిసిన సందర్భంలో ఈ పాట కూర్పు కుదిరిందని, అరిజిత్ సింగ్ తో కలిసి ఈ పాటలో పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఎడ్ షీరన్ తెలిపారు. డిసెంబర్ ఇరవై నాల్గవ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.