రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
తిరుపతి పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ కి ఘన స్వాగతం లభించింది. తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీ జేబీ శ్రీనివాస్, శాప్ ఛైర్మన్ శ్రీ రవి నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రికి తమ గౌరవాన్ని చాటుకున్నారు.