భారత్ నుంచి అత్యంత కఠినమైన బ్యాటర్ చేతేశ్వర్ పుజారా అని వెల్లడించిన పాట్ కమ్మిన్స్
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆస్ట్రేలియా
భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కాకుండా చేతేశ్వర్ పుజారాని తనకు అత్యంత కఠినమైన ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అభివర్ణించారు. ప్రైమ్ వీడియో స్పోర్ట్స్ కోసం నిర్వహించిన ప్రమోషనల్ వీడియోలో ఆయన మాట్లాడుతూ, పుజారా క్రీజులో పాతుకుపోయి వికెట్ ఇవ్వకుండా ఎంతో ఇబ్బంది పెట్టేవాడని, అతన్ని అవుట్ చేయడం చాలా కష్టమని కొనియాడారు. బోర్డర్- ట్రోఫీలో పుజారా ఆస్ట్రేలియా బౌలర్లను ఎంతగానో పరీక్షించాడని కమ్మిన్స్ గుర్తుచేసుకున్నారు.