జొమాటో క్యాష్ ఆన్ డెలివరీపై కొత్త ఫీజు వసూలు!
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకునే వారిపై అదనపు భారం మోపుతోంది. ఇకపై సీఓడీ ఆర్డర్లపై కొత్తగా రూ.5 నుంచి రూ.20 వరకు 'పే ఆన్ డెలివరీ' ఫీజు వసూలు చేస్తోంది. ఆన్లైన్ పేమెంట్స్ చేసేవారికి మాత్రం ఈ ప్రత్యేక ఛార్జీ వర్తించదని స్పష్టం చేసింది.