కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం: రూ.2,814 కోట్లతో క్రిటికల్ మినరల్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

దేశంలో క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర కేబినెట్ రూ.2,814 కోట్ల భారీ వ్యయంతో కేపెక్స్ సపోర్ట్ స్కీమ్ కు ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి G Kishan Reddy వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సరికొత్త పథకం ద్వారా కీలక ఖనిజాల అన్వేషణ, ప్రాసెసింగ్ ప్రక్రియ వేగవంతం అవుతుందని, భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు.