ఒడిశాలో భారీ వర్షాలు కారణంగా పాఠశాలలు అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేత
రిపోర్టర్: సతీష్
స్థలం: Odisha
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖుర్దా, జగత్‌సింగ్‌పూర్, గంజాం, గజపతి మరియు మల్కాన్‌గిరి జిల్లాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు విధులకు హాజరుకావాలని, అత్యవసర సేవల కోసం ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.