తెలంగాణలో బీజేపీ రాజకీయ వ్యూహం: అమిత్ షా పాదయాత్రతో కలకలం

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

దక్షిణాదిలో పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిందని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వేదికగా పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్లాన్ వేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు.