బిగ్బాస్ హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ ఎలిమినేషన్: ఉద్వేగభరితంగా వీడ్కోలు

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

బిగ్బాస్ తెలుగు పదో సీజన్ లో ఎనిమిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఫోక్ సింగర్ ఝాన్సీ హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఆమెను ఎలిమినేట్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ముకేశ్ మ్యాజిక్ పవర్ ఉపయోగించకపోతే సుధీర్ ఎలిమినేట్ అయ్యేవాడని నాగార్జున వెల్లడించారు. ఈ నిర్ణయంతో ముకేశ్, ఝాన్సీ కన్నీళ్లు పెట్టుకోవడంతో హౌస్ లో తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొందని ప్రేక్షకులు పేర్కొన్నారు.