ఏలేశ్వరం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన సిరిల్
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: ఏలేశ్వరం
ఏలేశ్వరం మండల ప్రత్యేక అధికారిగా సిరిల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రత్తిపాడులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామక వివరాలను ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం మండల పరిపాలనా వ్యవహారాలు, ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఇరువురు చర్చించారు. మండలంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు సమర్థంగా అమలు చేయడంపై చర్చించారు.