మహాకవి గురజాడ జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించనున్న ప్రభుత్వం

రిపోర్టర్: కిరణ్ స్థలం: విజయనగరం

దేశమంటే మనుషులోయ్‌ అంటూ సమాజాన్ని మేల్కొలిపిన మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతిని సోమవారం రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నారు. విజయనగరంలోని గురజాడ గృహంలో ఉదయం జ్యోతి ప్రజ్వలన, కాంస్య విగ్రహం వరకు ఊరేగింపు, సామూహిక గేయాలాపన నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జరిగే సభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించనున్నారు.