ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం ఒక శిశువు మృతి

రిపోర్టర్: శివ స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో అర్ధరాత్రి ఏసీలో సమస్య కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక నవజాత శిశువు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే 24 మంది శిశువులలో మిగిలిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.