రోడ్లపై గుంతలను గుర్తించేలా వినూత్న రోబోటిక్ వాహనాన్ని రూపొందించిన ఇంజినీరింగ్ విద్యార్థులు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: సంబల్‌పుర్

ఒడిశాలోని వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు రోడ్లపై గుంతలను గుర్తించే టెర్రైన్ ఇన్స్పెక్షన్ రోవర్ వాహనాన్ని రూపొందించినట్లు బృంద నాయకుడు ఆయుష్మాన్ అలోక్ పట్నాయక్ తెలిపారు. దాదాపు రెండు లక్షల రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ రోబోటిక్ పరికరం ద్వారా రహదారుల ఉపరితల వివరాలను సులువుగా సేకరించవచ్చని, దీనిని రక్షణ రంగంలోనూ నిఘా కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని విద్యార్థులు వెల్లడించారు.