ఏఐ అభివృద్ధిని ఆపడం కంటే బాధ్యత ముఖ్యం: మార్క్ జుకర్‌బర్గ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిని పూర్తిగా ఆపడం కంటే దాన్ని బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమని మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. ఏఐ మోడళ్లను సురక్షితంగా, ప్రజలకు అనుగుణంగా తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి సంస్థపై ఉందని చెప్పారు. సేఫ్టీ కోసం తమ ఉత్పత్తుల విడుదలను నెలల తరబడి ఆలస్యం చేసినట్లు ఆయన వెల్లడించారు.