జలదంకిలో ఉదారత: విద్యార్థులకు సొంత నిధులతో సైకిళ్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

రిపోర్టర్: సతీష్ స్థలం: జలదంకి

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ చూపటం సంతోషకరమని మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్రెడ్డి పేర్కొన్నారు. పీ4 పథకంలో భాగంగా జలదంకి మండలం బ్రాహ్మణక్రాక ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆయన సొంత నిధులతో సైపిళ్లను పంపిణీ చేశారు. మండలంలోని నాలుగు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు త్వరలో సైకిళ్లు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయురాలు జయలతితతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.