అంతర్జాతీయ వేదికపై భారతీయ ఉపాధ్యాయురాలికి అరుదైన గౌరవం: ఆక్స్ఫర్డ్ గ్లోబల్ అవార్డు దక్కించుకున్న మరియా షా

రిపోర్టర్: కిరణ్ స్థలం: లక్నో

లక్నోలోని ప్రేరణ గర్ల్స్ స్కూల్ ఉపాధ్యాయురాలు మరియా షా ఆక్స్ఫర్డ్ సైడ్ గ్లోబల్ క్లైమేట్ టెక్ ఛాలెంజ్ 2026 పోటీల్ లో ఉపాధ్యాయుల విభాగంలో విజేతగా నిలిచారని నిర్వాహకులు తెలిపారు. రుతుక్రమ ఆరోగ్య విద్యను వాతావరణ మార్పులు మరియు ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యలతో అనుసంధానిస్తూ ఆమె రూపొందించిన వినూత్న పాఠ్యాంశం ఈ అంతర్జాతీయ పురస్కారాన్ని దక్కించుకుందని ఆక్స్ఫర్డ్ సైడ్ బిజినెస్ స్కూల్ అధికారికంగా వెల్లడించింది.