దియా మీర్జా వీడియో తొలగింపు దురదృష్టకరం: బాంబే హైకోర్టు ఆగ్రహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Mumbai

నటి దియా మీర్జా వీడియో తొలగింపు దురదృష్టకరమని బాంబే హైకోర్టు స్పష్టం చేసిందని అధికారులు తెలిపారు. దీపావళి వేడుకల్ లో శబ్ధ కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు ఆమె చేసిన వీడియోను తొలగించడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముంబై నగరపాలక సంస్థ ఆ వీడియోను వెంటనే పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. పండుగలను అందరూ కలసి సంతోషంగా జరుపుకోవాలని, ఎవరినీ వేరుగా చూడకూడదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.