ప్రకృతిని పరిరక్షిస్తూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి:డా. శివప్రసాద్

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని సహస్ర ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. చినుకని శివ ప్రసాద్ తెలిపారు. విఘ్నాలను తొలగించి, ప్రజల జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, శాంతి, సౌభాగ్యం నింపాలని శ్రీ విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి, కాలుష్యాన్ని తగ్గించేలా పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి వేడుకలు ఐక్యత, సోదరభావం, సేవా భావాన్ని పెంపొందించేలా ఉండాలని, యువత మరియు ప్రజా సంఘాలు సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డా. చినుకని శివ ప్రసాద్ కోరారు.