గూడ పంచాయతీలో విద్యుత్ సమస్యకు చెక్: ఈతగొప్పులో కొత్త మినీ డీపీ ఏర్పాటు

రిపోర్టర్: srinu boddeti స్థలం: హుకుంపేట

అరుకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి చొరవతో గూడ గ్రామ పంచాయతీ ఈతగొప్పు గ్రామంలో ఏళ్ల తరబడి వేధిస్తున్న లో వోల్టేజ్ సమస్య పరిష్కారమైంది. ఎంపీ ఆదేశాల మేరకు అధికారులు నూతన మినీ డీపీని మంజూరు చేయగా, శుక్రవారం గ్రామస్థుల సమక్షంలో విద్యుత్ పనులను వేగవంతం చేశారు. ఈ అభివృద్ధి చర్యపై స్థానిక ప్రజలు, వైసీపీ నాయకులు ఎంపీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.