ముంబైలో 26 ఏళ్ల యువకుడికి గుండెపోటు, ప్రాణాలు కాపాడిన వైద్యులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ముంబై
ముంబైలో 26 ఏళ్ల రామ్ కుమార్ అనే యువకుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా, పొగాకు అలవాటు కారణంగా గుండె రక్తనాళంలో 100 శాతం బ్లాక్ ఏర్పడింది. గ్లెనెగల్స్ ఆసుపత్రి వైద్యులు వెంటనే స్పందించి యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్ వేసి ప్రాణాలను కాపాడారు. యువతలో పెరుగుతున్న గుండె సమస్యల పట్ల వైద్యులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.