కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ: రోగులతో మాట్లాడిన ఎమ్మెల్యే కసిరెడ్డి
రిపోర్టర్: Anjaneyulu Yadav
స్థలం: కల్వకుర్తి
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రసూతి వార్డు, డయాలసిస్ సెంటర్ సహా వైద్య పరికరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి అందుతున్న వైద్య సేవల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని, వైద్యులను ఎమ్మెల్యే నారాయణరెడ్డి కఠినంగా ఆదేశించారు. ఈ తనిఖీలో పొల్యూట్ బ్యూరో ఛైర్మన్ బాలాజీ సింగ్ పాల్గొన్నారు.