మహిళా ఎమ్మెల్యేలకు అవమానం: సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

అసెంబ్లీ ప్రాంగణంలో తమపై జరిగిన దాడి, పోలీసుల దురుసు ప్రవర్తనపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మగ పోలీసులతో తమపై దాడి చేయించి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సభలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.