పొదలకూరులో భక్తిశ్రద్ధలతో వైభవంగా శ్రీ పోలేరమ్మ జాతర తొలి చాటింపు

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరులో శ్రీ పోలేరమ్మ జాతర సందడి మొదలైంది. జాతరలో భాగంగా మంగళవారం అమ్మవారి చాటింపు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వెంకటగిరి సంప్రదాయాన్ని ఆదర్శంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో పూజల అనంతరం ప్రధాన వీధుల్లో చాటింపు వేశారు. వచ్చే నెల 6 నుంచి జాతర ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.