ఓటర్ల అవగాహనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఎన్నికల సంఘానికి మొట్టికాయలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

ఓటర్లలో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించే అధికారం కేవలం ఎన్నికల సంఘానికే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరుణా రాయ్ నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థకు రాజస్థాన్ ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడాన్ని అత్యున్నత ధర్మాసనం తప్పుబట్టింది. పంచాయతీ ఎన్నికల చివరి విడత ప్రచారంపై దరఖాస్తును నూతనంగా పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించినట్లు ప్రధానన్యాయమూర్తి సూర్యకాంత్ ధర్మాసనం వెల్లడించింది.