ఉచిత ఇసుక పథకంతో తొమ్మిది లక్షల మందికి లబ్ధి చేకూర్చాం

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పథకంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 8,94,745 మంది లబ్ధి పొందారని, 2,12,50,817 టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేసినట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు. అమరావతిలో శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ గత జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలై కార్మికులు వలస వెళ్లారని, కూటమి అధికారంలోకి రాగానే తీసుకువచ్చిన ఈ పథకంతో రంగం మళ్లీ గాడిన పడిందని పేర్కొన్నారు.