భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: అమెరికా
ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పాకిస్థాన్ సంఘర్షణ గురించి ప్రస్తావిస్తూ ఆ యుద్ధాన్ని తానే ఆపానని వ్యాఖ్యానించారు. తన హయాంలో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని తెలిపారు. అయితే ట్రంప్ వాదనను భారత్ గతంలోనే తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాల డీజీఎంవోల మధ్య జరిగిన చర్చల వల్లే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.