సకాలంలో గ్యాస్ అందించాలంటూ అధికారులను ఆదేశించిన కిడారి శ్రావణ్ కుమార్

రిపోర్టర్: Thrinadh Rudi స్థలం: పెదబయలు

అల్లూరి జిల్లా పెదబయలు మండలంలోని జీసీసీ గ్యాస్ గోడౌన్, డీఆర్ డిపో, పెట్రోల్ బంకును రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పరిశీలించారు. ఏజెన్సీ ప్రజలకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందించాలని, పంపిణీలో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. నిల్వలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతూ గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్ దొన్ను దొర, జీసీసీ డైరెక్టర్ బొర్ర నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.