టీవీవీపీలో షాడో కమిషనర్ పెత్తనంపై వైద్యుల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనరేట్‌లో అధికారిక హోదా లేని ఉద్యోగ సంఘం నేత షాడో కమిషనర్లా వ్యవహరిస్తూ పరిపాలనను శాసిస్తున్నారని బాధిత వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి కమిషనర్ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని బదిలీలు, పదోన్నతులు, ఫైళ్ల కదలికలను ఆయన ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆ నేత పెత్తనంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయిలో కమిషనర్‌ను నియమించాలని వైద్య వర్గాలు కోరుతున్నాయి.