తెలుగు భాషాభివృద్ధికి త్వరలో ప్రత్యేక సలహా కమిటీ: రఘురామకృష్ణంరాజు

రిపోర్టర్: హరి స్థలం: ఆంధ్రప్రదేశ్

తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భాషాభివృద్ధికి త్వరలోనే ప్రత్యేక సలహా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహనీయుల స్మృత్యర్థం విగ్రహాల ఏర్పాటు, ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు పేరుతో బ్రిడ్జి నామకరణం చేస్తున్నామని తెలిపారు. పరిపాలనలో తెలుగు భాషా వినియోగంపై పలువురు వక్తలు కీలక సూచనలు చేశారు.