స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ పిలుపు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలంలో బీజేపీ మండల అధ్యక్షులు కాకూరు శేఖర్ ఆధ్వర్యంలో పార్టీ పదాధికారుల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ఇంచార్జీ కందుల శ్రీనివాస్, పుట్ట గంగయ్య తదితరులు పాల్గొని దిశానిర్దేశం చేశారు.
రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమితో కలిసి సమష్టిగా పని చేసి విజయం సాధించాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.