రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణి కార్మికుల ఇళ్లను ఆలస్యం చేయొద్దు

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

సింగరేణి కార్మికుల సొంతింటి కలను రాజకీయ ప్రయోజనాల కోసం ఆలస్యం చేస్తే మరో పోరాటానికి సిద్ధమవుతామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి అన్నారు. సోమవారం శ్రీరాంపూర్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంతింటి కల నెరవేర్చడానికి నాలుగేళ్లుగా ఎన్నో పోరాటాలు చేసి సఫలమైనట్లు తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా రాజకీయ జోక్యంతో సంస్థను ఆర్థికంగా నష్టపరిచే విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకోవాలన్నారు.