విజయనగరంలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ నూతన శాఖ ప్రారంభం
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
ఉత్తర ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య, విద్యా కేంద్రంగా మారుతున్న విజయనగరంలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తన నూతన శాఖను ప్రారంభించింది. ఈ శాఖ ఏర్పాటుతో రాష్ట్రంలో కంపెనీ మొత్తం శాఖల సంఖ్య 16కి చేరిందని ఎండీ అండ్ సీఈఓ పంకజ్ గాడ్గిల్ తెలిపారు. స్థానిక ప్రజలకు గృహ రుణాలను అందించే లక్ష్యంతో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు ఎటువంటి లాగిన్ ఫీజులు లేకుండా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు వెల్లడించారు.