కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలని జేసీ ఆదేశం

రిపోర్టర్: THADI BHAVANI స్థలం: విజయనగరం

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్ మంగళవారం పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలోని ఏర్పాట్లను, అధికారుల పనితీరును దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.