బెంగళూరులో భర్త హత్య కలకలం, భార్య అరెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: కర్ణాటక

బెంగళూరులోని బిడరహళ్లిలో ముబారక్ బాషా అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడి ముఖంపై గాయాలు, ఊపిరాడకపోవడంతో పోలీసులు హత్యగా నిర్ధారించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య షహీనా బాను, ఆమె తల్లితో కలిసి భర్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.