మంచిర్యాలలో బియ్యం అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపుతామంటూ అదనపు కలెక్టర్ హెచ్చరిక
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
జిల్లాలో బియ్యం అక్రమ నిల్వలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ వి.రాములు హెచ్చరించారు. మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత సృష్టించడం వంటి అసాధారణ చర్యలకు పాల్పడరాదని స్పష్టం చేశారు. ప్రతి వ్యాపారి స్టాక్ బోర్డులను ప్రదర్శించాలన్నారు.