హైదరాబాద్ జూ పార్క్లోకి అరుదైన విదేశీ జంతువులు: త్వరలో కంగారూల సందడి

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో త్వరలోనే అరుదైన విదేశీ జంతువులు సందడి చేయనున్నాయని జూ అధికారులు తెలిపారు. గుజరాత్లోని జామ్నగర్కు చెందిన వంతారా వన్యప్రాణి కేంద్రం నుంచి ఆస్ట్రేలియా కంగారూలు, వాలబీలు, మడగాస్కర్ లెమూర్లను నగరానికి తీసుకొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జూ చరిత్రలోనే తొలిసారిగా కంగారూలను ప్రదర్శనకు ఉంచుతుండటంతో ప్రత్యేక ఎన్క్లోజర్లు, నైట్ హౌస్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కొత్త అతిథుల రాకతో నగర పర్యాటకం మరింత కళకళలాడుతుందని అధికారులు పేర్కొన్నారు.