బీసీసీఐ రంజీ షెడ్యూల్ తీరుపై గవాస్కర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: India
బీసీసీఐ రూపొందించిన దేశవాళీ షెడ్యూల్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐపీఎల్ వేలం కోసమే రంజీ ట్రోఫీని మధ్యలో ఆపి వైట్ బాల్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఆటగాళ్ల రిథమ్‌ను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, బోర్డులో అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.