మెల్బోర్న్లో ప్రవాస భారతీయులతో కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి సమావేశం: కీలక ప్రకటన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి మెల్బోర్న్లోని భారతీయ ప్రవాస సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆస్ట్రేలియా ఇండియా ఫౌండేషన్ మరియు స్థానిక కమ్యూనిటీ సంస్థల సంయుక్త ఆతిథ్యంలో అక్టోబర్ 28వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరగనుంది. కొత్తగా ప్రారంభమైన భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయ వేదికగా ఈ సభ జరగనుందని, ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులతో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.