ఐరాలలో ఘనంగా మేదరమెట్ల మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలం తిరుమలయ్యగారిపల్లి గ్రామంలో క్లస్టర్ ఇంచార్జ్ మేదరమెట్ల మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో భారీ కేకు కట్ చేసి, టపాసులు కాల్చి, సుమారు రెండు వందల మందికి గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందిస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్న ఆయనకు గ్రామస్తులు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.