పందిబండ వద్ద చెక్ డ్యామ్ నిర్మాణ పరిశీలన
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కొరటికల్ గ్రామంలోని పందిబండ వద్ద చెక్ డ్యామ్ నిర్మాణం కొరకు స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవతో ఈ పరిశీలన జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈ అభిరాం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కందటి అనంతరెడ్డి, ఉప సర్పంచ్ మామిడి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.