స్థానిక ఎన్నికలపై విజయవాడలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమావేశం

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయవాడ

విజయవాడలో జరిగిన కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ, రిజర్వెషన్లపై చర్చించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. సీట్ల కేటాయింపులపై అధినేతలు నిర్ణయం తీసుకుంటారని, కూటమి విజయం కోసం క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.