లక్షెట్టిపేట వద్ద లారీని ఢీకొని బైకర్ కు తీవ్ర గాయాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: లక్సెట్టిపేట
లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట స్టేజి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో రాపల్లి జీవన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.