స్థానిక ఎన్నికలపై వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్న కాకాణి
రిపోర్టర్: sai
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లిలో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. టీడీపీ బెదిరింపులను తిప్పికొట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కాకాణి పిలుపునిచ్చారు.